VOTE :ఓటేసిన రాష్ట్రపతి ముర్ము, సోనియా

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు(VOTE) హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తన భార్యతో కలిసి ఓటు వేశారు. ఇక తెలంగాణ గవర్నర్ రాధ క్రిష్ణన్ రాంచీలో ఓటు వేశారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఇరువురు కలిసి సెల్ఫీ దిగారు. ప్రియాంక గాంధీ తన కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్‌ వాద్రా క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, హరియాణ సీఎం నాయబ్ సింగ్ సైనీ తమ తమ రాష్ట్రాల్లో ఓటు(VOTE) వేశారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర నేతలు, సెలబ్రిటీలు పోలింగ్ లో పాల్గొన్నారు.

జమ్ములో ముఫ్తీ నిరసన
పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, పార్టీ శ్రేణులు జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ లో ఆందోనళకు దిగారు. ఎలాంటి కారణం లేకుండానే పీడీపీ పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

ALSO READ :