రాష్ట్రంలోని పలు జిల్లాల్లో (Earthquake) భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుకు జిల్లా మేడారం కేంద్రంగా ఈ భూకంపం కేంద్రీకృతమైంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఉదయం 7.27 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. సరిగ్గా 3 నెలల క్రితం ఇదే ప్రాంతంలో అడవిలో సుడిగాలి రావడంతో వేలాది చెట్లు నేల కూలాయి.
భూకంపం వచ్చిన సమయంలో మేడారం సమ్మక్క గద్దెలు కూడా కంపించాయి. దీంతో పూజారి ఆందోళనకు గురయ్యాడు. ఇదిలా ఉండగా ఇవాళ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, రాజేంద్రనగర్, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి జిల్లాలో భూమి కంపించింది. దీంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అటూ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూమి కంపించింది. దాదాపు భూమి లోపల 40 కిలోమీటర్ల లోతు నుంచి రేడియేషన్ వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో (Earthquake) భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుకు జిల్లా మేడారం కేంద్రంగా ఈ భూకంపం కేంద్రీకృతమైంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఉదయం 7.27 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.
సరిగ్గా 3 నెలల క్రితం ఇదే ప్రాంతంలో అడవిలో సుడిగాలి రావడంతో వేలాది చెట్లు నేల కూలాయి. భూకంపం వచ్చిన సమయంలో మేడారం సమ్మక్క గద్దెలు కూడా కంపించాయి. దీంతో పూజారి ఆందోళనకు గురయ్యాడు. ఇదిలా ఉండగా ఇవాళ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, రాజేంద్రనగర్, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి జిల్లాలో భూమి కంపించింది.
Also read:
- Devendra: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ డిప్యూటీగా షిండే కుమారుడు!
- Idli: సుబ్బారావు ఇడ్లీలకు పుష్ప టికెట్ల కు పోలికేంటి?

