EC :జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్(EC) షెడ్యూల్ విడుదలైంది. జూన్ 27 నుంచి ఆగస్టు 5 వరకు మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. వచ్చేనెల 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. జులై 12న సీట్లు కేటాయిస్తారు. జులై 19 నుంచి సెకండ్​ఫేజ్​కౌన్సెలింగ్(EC) ​ప్రారంభం కానుండగా.. 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్​జరగనుంది. ఆగస్టు 5న ఫైనల్​ఫేజ్ ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు. అలాగే ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ, 16 సీట్ల కేటాయింపు. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేశారు.

ALSO READ :