Ed Sheeran: బాద్​షా కోసం షీరాన్​ పాట

బాలీవుడ్​ బాద్​షా షారూక్​ ఖాన్​ను ఆకాశానికెత్తాడు బ్రిటీష్ గాయకుడు, గేయ రచయిత ఎడ్ షీరాన్(Ed Sheeran). ఆయన ప్ర‌పంచంలోనే అత్యంత‌ ప్ర‌సిద్ధ వ్య‌క్తి అంటూ కొనియాడాడు. షారుఖ్ ఖాన్ చిత్రం కోసం హిందీ ట్రాక్‌ను తాను రికార్డ్ చేసినట్లు ధృవీకరించాడు. ప్ర‌స్తుతానికి షారూక్​ సినిమాకి కింగ్ అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి చాలా విష‌యాలు రహస్యంగానే ఉన్నాయి. నిజానికి షీరాన్(Ed Sheeran) ఓ పంజాబీ పాట‌ను చేస్తున్నాడని ప్ర‌చారం సాగింది. కానీ ఆయనే స్వయంగా ఈ గందరగోళాన్ని తొలగించాడు. ‘ఈ పాట షారుఖ్ ఖాన్ చేస్తున్న బాలీవుడ్ సినిమా కోసం. ఇది అరిజిత్​తో కలిసి సఫైర్​కి పంజాబీ వెర్షన్. నేను ఈ సమయంలో అన్ని భాషలలో ప‌ని చేస్తున్నాను’ అని ఆయన రాశాడు. దీంతో కింగ్ షారూక్​ ఖాన్ సినిమా కోసం షీరాన్ పాడుతున్నార‌ని క్లారిటీ వ‌చ్చింది. స‌ఫైర్ గీతంలో షారూక్​, అరిజీత్ కూడా ఉన్నారు.

Also Read :