యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో విభేదాలు తలెత్తడంతో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు టెస్లా అధినేత (Elon Musk) ఎలాన్ మస్క్. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ ‘ఎక్స్’ మాధ్యమంలో ఓటింగ్ నిర్వహించారు. 80% మంది పార్టీకి అనుకూలంగ ఓట్లు వేశారు. ఈ క్రమంలోనే ‘ది అమెరికా పార్టీ’ అంటూ ఆయన చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ప్రపంచ కుబేరుడు ఇదే పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం మొదలైంది.
దీనిపై మస్క్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ట్రంప్-మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు తీవ్రంగా మారిన సంగతి తెలిసిందే. బహిరంగంగానే వీరిద్దరూ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. తానెవరి సాయం లేకుండా నెగ్గానని సమాధానమిచ్చారు.
డోజ్ నుంచి తప్పించినందుకే మస్క్‌కు అంత ఆక్రోశమని అధ్యక్షుడు పేర్కొన్నారు. ఇదే సమయంలో టెస్లా అధినేత కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల వేళ మస్క్ కొత్త పార్టీ ఆలోచన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎలాన్ మస్క్ రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారా? ట్రంప్‌తో విభేదాల నేపథ్యంలో ‘ది అమెరికా పార్టీ’ అనే కొత్త రాజకీయ పార్టీపై మస్క్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓటింగ్‌లో 80% మంది మద్దతు తెలపడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, రాజకీయ రంగంలో మస్క్ అడుగులపై ప్రపంచం కన్నేసింది!

Also read;