సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) పై దాడి కేసును పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగ లిఫ్ట్ నుంచి రాలేదని పోలీసులు తేల్చారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. సైఫ్ ఇంట్లో పనివారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దొంగపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఆగంతకుడు దొంగతనం కోసమే వచ్చినట్లు భావిస్తున్నామని డీసీపీ దీక్షిత్ గేడమ్ తెలిపారు. పది బృందాలు ఈ కేసు దర్యాప్తు కోసం పనిచేస్తున్నాయని, నిందితుడిని గుర్తించామని చెప్పారు. ఇప్పటికే సైఫ్ ఇంట్లో పనిచేసే ఐదుగురు పనివారిని పోలీసులు ప్రశ్నించారు. దాడిలో (Saif Ali Khan) సైఫ్‌కు వీపుపై భాగంలో వెన్నెముక వద్ద తీవ్రగాయం అయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స చేసి 2.5 అంగుళాల కత్తి ముక్కను అక్కడి నుంచి తొలగించారు.
ఆటోలో ఆస్పత్రికి!
దొంగ దాడిలో గాయపడిన సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ ఆటోలో ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దాడి జరిగిన సమయంలో ఇంటి వద్ద కారు సిద్ధంగా లేకపోవడంతోనే ఇబ్రహీం తన తండ్రిని ఆటోలో తీసుకువచ్చాడని మీడియాలో కథనాలు వచ్చాయి.
సైఫ్ అలీఖాన్ పై దాడి కేసును పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగ లిఫ్ట్ నుంచి రాలేదని పోలీసులు తేల్చారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. సైఫ్ ఇంట్లో పనివారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దొంగపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

ఆగంతకుడు దొంగతనం కోసమే వచ్చినట్లు భావిస్తున్నామని డీసీపీ దీక్షిత్ గేడమ్ తెలిపారు. పది బృందాలు ఈ కేసు దర్యాప్తు కోసం పనిచేస్తున్నాయని, నిందితుడిని గుర్తించామని చెప్పారు. ఇప్పటికే సైఫ్ ఇంట్లో పనిచేసే ఐదుగురు పనివారిని పోలీసులు ప్రశ్నించారు. దాడిలో సైఫ్‌కు వీపుపై భాగంలో వెన్నెముక వద్ద తీవ్రగాయం అయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స చేసి 2.5 అంగుళాల కత్తి ముక్కను అక్కడి నుంచి తొలగించారు.
Also read:

