రైతు బజార్లో రైతులకే ఫస్ట్ ప్రయారిటీని కల్పిస్తామని, కూరగాయలను పండించే రైతులే నేరుగా వచ్చి రైతు బజార్ లో వ్యాపారం చేసేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. ఇవాళ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్ లో భక్త రామదాసు కళాక్షేత్రం ప్రక్కన ఉన్న పాత అగ్రికల్చర్ మార్కెట్ లో మున్సిపల్ నిధులు రూ. 41 లక్షలతోచేపట్టే షెడ్లు, ప్లాట్ ఫామ్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖమ్మం పట్టణానికి చుట్టుప్రక్కల ఉన్న కూరగాయలు పండించే రైతులు నేరుగా మార్కెట్ కు వచ్చి కూరగాయలను అమ్ముకోవడం వల్ల వినియోగదారులకు, రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు.
రఘునాధపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో కూరగాయలు పండించే రైతులు నేరుగా వచ్చి మార్కెట్ స్థలం నందు నిర్మిస్తున్న షెడ్లు, ప్లాట్ ఫార్మ్ లలో కూరగాయలు అమ్ముకోవాలన్నారు. దీంతో ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందుతాయని, ఎక్కడా దళారులు రావడానికి వీలు లేదన్నారు.
రైతు బజార్లో రైతులకే ఫస్ట్ ప్రయారిటీని కల్పిస్తామని, కూరగాయలను పండించే రైతులే నేరుగా వచ్చి రైతు బజార్ లో వ్యాపారం చేసేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. ఇవాళ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్ లో భక్త రామదాసు కళాక్షేత్రం ప్రక్కన ఉన్న పాత అగ్రికల్చర్ మార్కెట్ లో మున్సిపల్ నిధులు రూ. 41 లక్షలతోచేపట్టే షెడ్లు, ప్లాట్ ఫామ్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖమ్మం పట్టణానికి చుట్టుప్రక్కల ఉన్న కూరగాయలు పండించే రైతులు నేరుగా మార్కెట్ కు వచ్చి కూరగాయలను అమ్ముకోవడం వల్ల వినియోగదారులకు, రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. రఘునాధపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో కూరగాయలు పండించే రైతులు నేరుగా వచ్చి మార్కెట్ స్థలం నందు నిర్మిస్తున్న షెడ్లు, ప్లాట్ ఫార్మ్ లలో కూరగాయలు అమ్ముకోవాలన్నారు. దీంతో ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందుతాయని, ఎక్కడా దళారులు రావడానికి వీలు లేదన్నారు.
Also read:

