మహా కుంభామేళా (Kumbha Mela) లో మరో అపశృతి చోటుచేసుకుంది. సెక్టార్-22లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసిపడుతున్న మంటల ధాటికి టెంట్లు కాలిపోతున్నాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెలుస్తున్నారు. వీఐపీల వసతి కోసం ఈ టెంట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడే మంటలు చెలరేగడం కలకలం రేపింది. జనవరి 19వ తేదీన సెక్టార్ 19లోనూ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ రోజు (Kumbha Mela) తాత్కాలిక వసతి కోసం ఏర్పాటు చేసిన 180 టెంట్లు కాలిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తొక్కిసలాట జరిగి 30 మంది మృత్యువాత పడ్డ మరుసటి రోజే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.
సెక్టార్ 22 ప్రత్యేకత ఇది
మహా కుంభమేళాలో సెక్టార్ 22 అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఈ ఏరియాలో ఎక్కువ సంఖ్యలో భక్తుల వసతి కోసం వేల సంఖ్యలో టెంట్లు ఏర్పాటు చేశారు. వీఐపీల రాక కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సెక్టార్ 22 నుంచి త్రివేణి సంగమం ప్రధాన ప్రదేశం దగ్గరలోనే ఉంటుంది. ఈ సెక్టార్ 22కు సమీపంలోనే గంగ, యమున, సరస్వతి నదుల సంగమం ఉంటుంది. సంగమ ప్రాంతంలో పవిత్ర స్నానం చేయాలి అని నిర్ణయించుకున్న వారు ఈ సెక్టార్ 22 దగ్గరకు వస్తుంటారు. సెక్టార్ 22 వీఐపీ తాడికి కూడా ఎక్కువగా ఉంటుంది.

ALso read: