జమ్మూ కాశ్మీర్(Kashmir) లో పదేండ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదటి దశలో భాగంగా 24 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 24 సెగ్మెంట్ల పరిధిలో 219 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఏడు జిల్లాల పరిధిలో ఈ సెగ్మెంట్లు విస్తరించి ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాశ్మీర్‌లో 16, జమ్ములో (Kashmir) 8 స్థానాల్లో 3 వేల 276 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు. 23 లక్షల 27 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
మహిళలు, ప్రత్యేక వికలాంగులు , యువత నిర్వహించే ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు, పర్యావరణ సమస్యల గురించి సందేశాలను వ్యాప్తి చేయడానికి గ్రీన్ పోలింగ్ స్టేషన్లు , ఇతర ప్రత్యేక పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
Also read :
Nayantara : హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్
Shraddha Arya : తల్లిని కాబోతున్నా

