బీఆర్ఎస్ నేత, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే (Marri Janardhan Reddy)మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. భూదాన్ భూముల స్కాంలో ఆయనతో పాటు వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 16న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆమోద డెవలపర్స్‌కి చెందిన సూర్య తేజతో పాటు కేఎస్సార్ మైన్స్ కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్ లో లాభ పడినట్లు ఈడీ గుర్తించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పలుమార్లు విచారించింది. తాజాగా నలుగురికి నోటీసులు జారీ చేసింది. లావాదేవీలపై బాధితులు ఈడీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు ప్రశ్నించింది. రూ.కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు కేటాయించడంపై ఐదు రోజులపాటు ప్రశ్నించారు. ఈ మేరకు అమోయ్ కుమార్, మహేశ్వరం తహశీల్దార్ వాంగ్మూలాలను నమోదు చేశారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అప్పటి ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతితోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు.
బీఆర్ఎస్ నేత, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే (Marri Janardhan Reddy ) మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. భూదాన్ భూముల స్కాంలో ఆయనతో పాటు వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 16న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆమోద డెవలపర్స్‌కి చెందిన సూర్య తేజతో పాటు కేఎస్సార్ మైన్స్ కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్ లో లాభ పడినట్లు ఈడీ గుర్తించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పలుమార్లు విచారించింది. తాజాగా నలుగురికి నోటీసులు జారీ చేసింది. లావాదేవీలపై బాధితులు ఈడీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు ప్రశ్నించింది. రూ.కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు కేటాయించడంపై ఐదు రోజులపాటు ప్రశ్నించారు. ఈ మేరకు అమోయ్ కుమార్, మహేశ్వరం తహశీల్దార్ వాంగ్మూలాలను నమోదు చేశారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అప్పటి ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతితోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు.
Also read:

