యశోద(Yashodha) ఆస్పత్రిలో మళ్లీ చేరిన మాజీ సీఎం కేసీఆర్ – ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్, హరీశ్ రావు కలవరం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ఆరోగ్య పరిస్థితి మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత వారం రోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన, బ్లడ్ షుగర్ లెవల్స్ అధికం, సోడియం లెవల్స్ పడిపోవడం వల్ల ఆసుపత్రిలో 3 రోజుల పాటు చికిత్స పొందారు. జూలై 3న ఆసుపత్రిలో జాయిన్ అయిన కేసీఆర్, జూలై 5న డిశ్చార్జ్ అయ్యారు.
విశ్రాంతి అనంతరం మళ్లీ వైద్య పరీక్షలు
డిశ్చార్జ్ అయిన తర్వాత బంజారాహిల్స్ నందినగర్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌కు వైద్యులు వారం రోజుల రెస్ట్ సూచించారు. ఈ క్రమంలో తిరిగి వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొనడంతో కేసీఆర్ మళ్లీ సోమాజిగూడ యశోద(Yashodha) ఆసుపత్రిలో చేరారు.
కుటుంబ సభ్యుల మద్దతు
ఈసారి కేసీఆర్ వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. భార్య శోభ, కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు కేసీఆర్‌కు మద్దతుగా ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు అత్యాధునిక పరికరాలతో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఎలాంటి ఆందోళన అవసరం లేదు
అధికారికంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తి వివరాలు వెలువడకపోయినా, బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం తీవ్ర ఆందోళన అవసరం లేదు. వైద్యులు నియమించిన రిగులర్ చెకప్ లో భాగంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్టు స్పష్టం చేస్తున్నారు.
ఆరోగ్యంపై రాజకీయ విశ్లేషణలు
ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు ఈ పరిస్థితిని తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న గమనంగా కూడా చూస్తున్నారు. పార్టీ నాయకత్వ మార్పు, లేదా పరిపాలనలో చురుకైన భూమికపై చర్చలు జరుగుతున్న వేళ, కేసీఆర్ తరచూ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లడం కీలక పరిణామంగా మారింది.
Also Read :

