HyderabadGanesh: రేపే హైదరాబాద్‌లో గణేశ్ మహా నిమజ్జనం

HyderabadGanesh

(HyderabadGanesh) హైదరాబాద్ నగరం రేపు గణేశ్ నిమజ్జనోత్సవంతో సందడి కానుంది. బాలాపూర్ గణపతి శోభాయాత్రతో సహా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా విగ్రహాలు నిమజ్జనం కోసం బయలుదేరనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ విభాగం ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది. (HyderabadGanesh) రేపు (సెప్టెంబర్ 6) ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

Image

ప్రధాన శోభాయాత్ర మార్గం:
బాలాపూర్ నుంచి బయలుదేరిన శోభాయాత్ర చార్మినార్ – అబిడ్స్ – లిబర్టీ – ట్యాంక్ బండ్ – నెక్లెస్ రోడ్ మీదుగా సాగనుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన శోభాయాత్ర ప్యాట్నీ – ప్యారడైజ్ – రాణిగంజ్ – కర్బలామైదాన్ – ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి బయలుదేరిన విగ్రహాలు లిబర్టీ వద్ద కలుస్తాయి. టోలిచౌకి, మెహదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. తప్పాచబుత్రా, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాలు ఎంజే మార్కెట్ వద్ద కలుస్తాయి.

ట్రాఫిక్ ఆంక్షలు:
ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు ప్రవేశం ఉండదు. నిమజ్జనం అనంతరం లారీలు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతించబడతాయి. రేపు ఉదయం 6 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోకి లారీల ప్రవేశం నిలిపివేయబడింది.

హెల్ప్‌లైన్ నంబర్లు:
భక్తుల సౌకర్యార్థం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్‌వేషన్ పాండ్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి:
📞 040-27852482, 8712660600, 9010203626

డైవర్షన్ పాయింట్లు:

  • సౌత్‌ఈస్ట్ జోన్: కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడ

  • సౌత్ జోన్: అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దారుషిఫా

  • ఈస్ట్ జోన్: శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్‌నగర్, వైఎంసీఏ

  • సెంట్రల్ జోన్: లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధభవన్

  • నార్త్ జోన్: ప్యాట్నీ, ప్యారడైజ్, రాణిగంజ్

పార్కింగ్ ప్రదేశాలు:
ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ గుడి, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్.

నో ఎంట్రీ జంక్షన్లు:
ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగుతల్లి చౌరస్తా, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా.

ఆర్టీసీ బస్సుల డైవర్షన్:
బస్సులు పీక్ సమయంలో మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ వరకు మాత్రమే నడుస్తాయి. అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులు చాదర్‌ఘాట్ వైపు మళ్లించబడతాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ ఉపయోగించాలి.

బాలాపూర్ గణేశ్ రూట్ మ్యాప్:
కట్ట మైసమ్మ దేవాలయం → కేశవగిరి → చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్ → మహబూబ్‌నగర్ ఎక్స్ రోడ్ → ఇంజన్ బౌలి → అలియాబాద్ → నాగుల్ చింత జంక్షన్ → హిమ్మత్‌పురా → చార్మినార్ → మదీనా క్రాస్ రోడ్ → అఫ్జల్ గంజ్ → ఎంజే మార్కెట్ → అబిడ్స్ జీపీఓ → బీజేఆర్ విగ్రహం → బషీర్‌బాగ్ క్రాస్ రోడ్ → లిబర్టీ → అంబేద్కర్ విగ్రహం → ట్యాంక్ బండ్.

Also read: