లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హసన్ ఎంపీ అభ్యర్థి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ (Prajwal) రేవణ్ణను సస్పెండ్ చేస్తున్నట్టు జేడీఎస్ ప్రకటించింది. జేడీఎస్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. మహిళలతో అసభ్యకర వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రజ్వల్‌కు పార్టీ షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. “ప్రజ్వల్ (Prajwal) రేవణ్ణపై సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నాం. సిట్ విచారణ పూర్తయ్యే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మా పార్టీ జాతీయ అధ్యక్షుడికి సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం” అని జేడీ(ఎస్) కోర్ కమిటీ అధ్యక్షుడు జీటీ దేవెగౌడ తెలిపారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమని పార్టీ పార్టీ అధినేత హెచ్డి కుమారస్వామి అన్నారు.
Also read:

