సికింద్రాబాద్ చిలకలగూడా (Chilakalguda) పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. సర్ ప్రైజ్ ఆపరేషన్ లో భాగంగా రాత్రి 2 గంటల ప్రాంతంలో యాంటీ డెకాయిట్ పోలీస్టీంలోని ఓ సభ్యుడు మెట్టుగూడా ప్రాంతంలోని ఫుట్ పాత్ పై పడుకున్నాడు. ఆ టైంలో అక్కడికి సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా వచ్చి హల్చల్ చేసింది. టీంలోని వ్యక్తి పడుకున్నపుడు అతనిసెల్ ఫోన్ దొంగలించడానికి నలుగురు వ్యక్తులు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడున్న(Chilakalguda) పోలీసులను చూసి పారిపోయేందుకు స్నాచింగ్ ముఠా ప్రయత్నించింది. ఈ క్రమంలో యాంటీ టీకాయిట్ టీం సభ్యులు ముగ్గురికి, దుండగుల మధ్య తోపులాట జరిగింది. దొంగలను పట్టుకోవడానికి ముఠాపై కానిస్టేబుల్ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే తోపులాటలో డేకాయిట్ టీమ్ సభ్యుడు ఒకరు పిస్టల్(రివాల్వర్) తీయగా అనుకోకుండా మిస్ ఫైర్ అయ్యిందని చిలకలగూడ సీఐ చెప్పారు. ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ చిలకలగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. సర్ ప్రైజ్ ఆపరేషన్ లో భాగంగా రాత్రి 2 గంటల ప్రాంతంలో యాంటీ డెకాయిట్ పోలీస్టీంలోని ఓ సభ్యుడు మెట్టుగూడా ప్రాంతంలోని ఫుట్ పాత్ పై పడుకున్నాడు. ఆ టైంలో అక్కడికి సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా వచ్చి హల్చల్ చేసింది. టీంలోని వ్యక్తి పడుకున్నపుడు అతనిసెల్ ఫోన్ దొంగలించడానికి నలుగురు వ్యక్తులు ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడున్న పోలీసులను చూసి పారిపోయేందుకు స్నాచింగ్ ముఠా ప్రయత్నించింది. ఈ క్రమంలో యాంటీ టీకాయిట్ టీం సభ్యులు ముగ్గురికి, దుండగుల మధ్య తోపులాట జరిగింది. దొంగలను పట్టుకోవడానికి ముఠాపై కానిస్టేబుల్ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే తోపులాటలో డేకాయిట్ టీమ్ సభ్యుడు ఒకరు పిస్టల్(రివాల్వర్) తీయగా అనుకోకుండా మిస్ ఫైర్ అయ్యిందని చిలకలగూడ సీఐ చెప్పారు. ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:

