ఇవాళ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ముద్దుల తనయ (Sitara) సితార బర్త్ డే. తన కుమార్తెకు ప్రత్యేకంగా మహేశ్ బాబు ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. సితార ఫొటో షేర్ చేసి ‘హ్యాపీ 12 మై సన్‌షైన్’ అని పేర్కొన్నారు. మరోవైపు, నమ్రత సైతం ఇన్‌స్టా వేదికగా స్పెషల్ వీడియో షేర్ చేశారు.(Sitara) సితార చిన్నప్పటి ఫొటోలు, వీడియోలతో దీనిని క్రియేట్ చేశారు. ‘‘నా చిట్టి ప్రయాణ సహచరురాలికి జన్మదిన శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. నువ్వు ఎల్లప్పుడూ నాకొక ట్రావెల్ గైడ్‌లా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకం చేశావు. ఈ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఐ లవ్ యూ మై స్వీట్హార్ట్’అనే క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టులపై పలువురు నెటిజన్లు స్పందించారు. సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
సితార ఇటీవల ఓ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఆ అడ్వర్టయిజ్ మెంట్ ద్వారా వచ్చిన పారితోషికాన్నిసమాజసేవకు ఉపయోగించారు.
తనకు నటి కావాలని ఉందని.. అవకాశం వస్తే భవిష్యత్తులో తప్పకుండా నటన వైపు వస్తానని ఇప్పటికే తెలిపారు. ఈ క్రమంలోనే డ్యాన్స్‌లో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన ఓ పాట కోసం ఆమె స్క్రీన్‌పై కూడా కనిపించారు.
Also read:
Hyderabad: టూరిజం హబ్ గా హైదరాబాద్
RAIN :గోదావరి గలగల.. కృష్ణమ్మ బిరబిర

