ఆరు నూరైనా తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం పక్కా అని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish) అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు నిద్రపోమని చెప్పారు. వారిపై అనర్హత వేటు కోసం సుప్రీంకోర్టులో పోరాడుతామని చెప్పారు. ఆ సెగ్మెంట్లలో తప్పకుండా ఉప ఎన్నిక వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పటాన్ చెరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరూ చూశారని అన్నారు. కుట్రలు ఎప్పుడూ ఫలించవని చెప్పారు. బీఆర్ఎస్ పని అయిపోయిందన్న వాళ్లు ఆ తర్వాత కనిపించకుండా పోయారని గుర్తు చేశారు. పార్టీకి కష్టాలు వస్తాయని, కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలని కోరారు. ఎమ్మెల్యే పోతే పార్టీ పోదని అన్నారు. పటాన్ చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారని అన్నారు. మీరంతా కష్టపడితేనే మహిపాల్ రెడ్డి గెలిచారన్నారు. గూడెం పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకుందామని, మళ్లీ గులాబీ జెండా ఎగిరేవరకు కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టండన్న రేవంత్ ఇప్పుడు ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారన్నారు. పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, దానికి ఇప్పట్నుంచే సిద్ధం కావాలని హరీశ్(Harish) రావు అన్నారు.పటాన్ చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారని అన్నారు. మీరంతా కష్టపడితేనే మహిపాల్ రెడ్డి గెలిచారన్నారు. గూడెం పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకుందామని, మళ్లీ గులాబీ జెండా ఎగిరేవరకు కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టండన్న రేవంత్ ఇప్పుడు ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారన్నారు. పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, దానికి ఇప్పట్నుంచే సిద్ధం కావాలని హరీశ్(Harish) రావు అన్నారు.
ALSO READ :

