Harish rao: ఢిల్లీలో పోరాటానికి సిద్ధం

Harish rao

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 % రిజర్వేషన్ కల్పించాలని మాజీ మంత్రి హరీశ్ (Harish rao) అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును బీఆర్ఎస్ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి సైతం వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని (Harish rao) స్పష్టంచేశారు. విద్య, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఫలాలు అందినప్పుడే ఆ వర్గాలు చాలా సంతోషపడతాయని చెప్పారు. అసెంబ్లీలో హరీశ్ మాట్లాడుతూ ‘పార్లమెంటులో బీసీ బిల్లు పాస్ కోసం రాహుల్ గాంధీ గట్టిగా పూనుకోవాలని కోరుతున్నం. రేపు బడ్జెట్ పెడుతున్నందున బీఆర్ఎస్ పార్టీ పక్షాన మూడు అంశాలను చేర్చాలని కోరుతున్నం. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి. దీనికి ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు. బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. క్యారీ ఫార్వర్డ్ విధానంలో అమలు చేయాలి. ఆమోదం విషయం పార్లమెంట్ చేతిలో ఉంది కాబట్టి భేషజాలకు పోకుండా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ సబ్ ప్లాన్ ను చేర్చండి. బడ్జెట్లో రూ.20 వేల కోట్ల నిధులు పెట్టండి’ అని సూచించారు.

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 % రిజర్వేషన్ కల్పించాలని మాజీ మంత్రి హరీశ్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును బీఆర్ఎస్ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి సైతం వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. విద్య, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఫలాలు అందినప్పుడే ఆ వర్గాలు చాలా సంతోషపడతాయని చెప్పారు. అసెంబ్లీలో హరీశ్ మాట్లాడుతూ ‘పార్లమెంటులో బీసీ బిల్లు పాస్ కోసం రాహుల్ గాంధీ గట్టిగా పూనుకోవాలని కోరుతున్నం. రేపు బడ్జెట్ పెడుతున్నందున బీఆర్ఎస్ పార్టీ పక్షాన మూడు అంశాలను చేర్చాలని కోరుతున్నం. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి. దీనికి ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు. బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. క్యారీ ఫార్వర్డ్ విధానంలో అమలు చేయాలి. ఆమోదం విషయం పార్లమెంట్ చేతిలో ఉంది కాబట్టి భేషజాలకు పోకుండా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ సబ్ ప్లాన్ ను చేర్చండి. బడ్జెట్లో రూ.20 వేల కోట్ల నిధులు పెట్టండి’ అని సూచించారు.

Harish Seeks Revanth's Apology for His Comments on KCR

Also read: