ఆస్తి ఇవ్వడం లేదని ఓ ప్రవృద్ధుడు కన్న తల్లి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన వరంగల్(Warangal) జిల్లాలో చోటు చేసుకుంది జరిగింది. సంగెం మండలం కుంటపల్లి కి చెందిన ముత్తినేని సాంబయ్య, వినోద లకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంది. ఒక కొడుకు చాలా రోజుల క్రితమే మృతి చెందాడు. కొద్దిరోజుల క్రితం టెక్స్టైల్ పార్కు లో వీరికి ఉన్న కొంత భూమి కోల్పోవడంతో… డబ్బులు వచ్చాయి.(Warangal) వినోద ఆ డబ్బులు మొత్తం తనకు ఇవ్వకుండా కూతురికే ఇస్తుందనే నెపంతో కొడుకు సతీష్ తల్లిదండ్రులతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో రెండు రోజులు డబ్బులు కావాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున తల్లిదండ్రులతో గొడవపడి వినోదపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో వినోద 80 శాతం వరకు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు గమనించి ఆమెను వరంగల్ ఎంజీఎం కు తరలించగా.. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. సతీష్ పరారీలో ఉన్నట్లుగా సమాచారం.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Also Read :
- Delhi: టెంపోలో ఫ్రంట్ సీట్ ఇవ్వలేదని తండ్రిని కాల్చేసిండు
- Mohan Yadav: కాన్వాయ్కి కల్తీ డీజిల్ షాక్!

