Hema: పోలీసుల అదుపులో హేమ

Hema

రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీ నటి హేమను (Hema) బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ టెస్టులో ఆమెకు పాజిటివ్ రాగా, విచారణకు రావాలని రెండుసార్లు నోటీసులు ఇవ్వగా హాజరుకాలేదు. తాజాగా సీసీబీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల 20న హేమ (Hema) బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొన్నారు. అందులో 86 మంది మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also read: