Hema: హేమకు రెండోసారి

Hema

రేవ్ పార్టీలో కేసులో టాలీవుడ నటి హేమకు(Hema) బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. జూన్ 1న (శనివారం) విచారణకు రావాలని ఆదేశించారు. తొలుత ఈనెల 27న హాజరుకావాలని నోటీసులు పంపగా.. వైరల్ ఫీవర్ కారణంగా రాలేనని ఆమె (Hema) డుమ్మా కొట్టారు. ఈమేరకు పోలీసులకు లేఖ రాశారు. అయితే దీనిపై హేమ లీగల్​ఫైట్ చేస్తామని తెలిపారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం150 మంది పాల్గొనగా.. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్ధికి, నాగబాబుతో పాటుగా ఐదుగురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి కోర్టు ఆదేశించింది. రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌ సరఫరా వెనక ఉన్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Also read: