సీనియర్ ఐఏఎస్ అధికారులకు హైకోర్టు (High Court) లో చుక్కెదురైంది. ముందు బదిలీ చేసిన స్థానానికి వెళ్లాని ఆదేశిస్తూ పిటిషన్ డిస్మిస్ చేసింది. ట్రిబ్యునల్లో నవంబరు 4న విచారణ ఉందని, అప్పటి వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్ల తరఫు న్యాయవాది కోరారు. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాదాన్ని తేలుస్తామని, ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని సూచించింది. ‘‘మీరంతా బాధ్యతాయుతమైన అధికారులు.. ప్రజలకు ఇబ్బంది కలగనీయొద్దు. ఎవరు ఎక్కడ పనిచేయాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది.’అని తెలిపింది.
తమ బదిలీలను రద్దు చేయాలని కోరుతూ పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రోనాల్డ్ రాస్ తెలంగాణలో పనిచేస్తుండగా డీవోపీటీ వారిని ఏపీకి బదిలీ చేసింది. అలాగే ఏపీలో పనిచేస్తున్న అనంతరాము, రావత్, హరికిరణ్, సృజన, శివశంకర్లను తెలంగాణకు బదిలీ చేసింది. వీరిలో ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రోనాల్డ్ రాస్, సృజన, శివశంకర్, హరికిరణ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్(క్యాట్)ను ఆశ్రయించారు.
నిన్న విచారించిన ట్రిబ్యునల్ డీవోపీటీ నిబంధనలకు కట్టుబడాలని సూచిస్తూ తీర్పు వెలువరించింది. ఏడుగురు ఐఏఎస్ అధికారులు క్యాట్ తీర్పును సవాలు చేస్తూ ఇవాళ (High Court) హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం విచారణకు స్వీకరించిన జస్టిస్ అభినందన్ షావలీ బెంచ్ కేంద్ర ప్రభుత్వం ఎవరికి కేటాయించిన స్థానంలో ముందు రిపోర్టు చేయాలని ఆదేశించింది. బదిలీ అయిన స్థానంలో పని ఒత్తిడి ఏమున్నా ఆ అధికారి చూసుకోవాల్సిందేని తెలిపింది. గౌరవ ప్రదమైన ఉద్యోగంలో ఉన్న అధికారులు ఈ విధంగా ఆలోచించవద్దని సూచించింది.
Also read:

