High court :కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు(High court) విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ఈడీ కౌంటర్ దాఖలు చేయగా.. సీబీఐ ఈ నెల 27న కౌంటర్ దాఖలు చేయనున్నట్టు కోర్టుకు తెలిపింది. ఒక రోజు ముందే కవిత తరఫు న్యాయవాదికి నోటీసు అందించాలని సూచిస్తూ విచారణను ఈ నెల 28వ తేదీ(మంగళవారం)కి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు(High court) కవిత తరఫు న్యాయవాది వివరించారు. సోమవారం రెండు కేసుల్లో కవిత తరఫు వాదనలు పూర్తి చేయాలని సూచించింది.

ALSO READ :