డబుల్బెడ్రూమ్ఇండ్ల(Indhiramma illu) కోసం కేంద్రం నిధుల ఇస్తే.. పేరు ఇందిరమ్మ ఇండ్లు(Indhiramma illu) అని పెట్టడం సరికాదని, సొమ్ము కేంద్రానికి అయిటే ఇందరమ్మ పేరు పెట్టారని మెదక్ఎంపీ రఘునందన్‌రావు ఫైర్అయ్యాడు. బీజేపీ స్టేట్ఆఫీస్లో ప్రెస్మీట్లో రఘునందన్మాట్లాడారు.. ఇందిరమ్మ కమిటీల పేరుతో లబ్ధిదారులను ఎంపిక చేయడం సరికాదన్నారు. బీజేపీని భాగస్వామ్యం చేయాలన్నారు. ఇందిరమ్మ కమిటీలకు చట్టబద్దత లేదన్నారు. ఇందిరమ్మ కమిటీలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తే తాము అడ్డుకుంటామని వార్నింగ్ఇచ్చారు. దీనిపై హైకోర్టుకు వెళ్తామన్నారు. ‘ బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. బీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ (రిటైర్ మెంట్) ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారు. కల్వకుంట్ల ఇంట్లో మనిషికో ఫామ్‌హౌస్ ఉంది. అవినీతి పరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తాం. ఆరు నెలల కింద కేంద్రం ఉపాధి హామీ పథకం కింద రూ. 1200 కోట్లు విడుదల చేసింది. గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. గతంలో సిరిసిల్ల, సిద్దిపేటను సుడా చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ ను కుడా చేసుకున్నారు. గ్రామ సభలు పెట్టీ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయాలి. తప్పితే.. ఇందిరమ్మ కమిటీల ద్వారా కాదు. దీనిని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గ్రామ పంచాయితీలకు ఎన్నికలు పెట్టే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు’ అని రఘునందన్అన్నారు.
Also Read :

