(Hong Kong) హాంకాంగ్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ప్రారంభమైన ఈ ప్రమాదం క్షణాల్లోనే పెద్దదిగా మారింది. వాంగ్ ఫుక్ కోర్ట్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగి భయానక దృశ్యాలు సృష్టించాయి. ఈ కాంప్లెక్స్‌లో 31 అంతస్తులు కలిగిన ఏడు భారీ బిల్డింగ్‌లు ఉన్నాయి. ఇది (Hong Kong) హాంకాంగ్‌లో అత్యంత రద్దీగా ఉండే హౌసింగ్ బ్లాక్‌లలో ఒకటి.
ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 2 వేల ప్లాట్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 4,800 మంది నివసిస్తున్నారు. చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు, వృద్ధులు, చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు ఈ అపార్ట్‌మెంట్‌లలో ఉంటారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు నివసించే ప్రదేశంలో మంటలు చెలరేగడంతో పరిస్థితి ఒక్కసారిగా నియంత్రణలో ఉండలేదు.
గత కొన్ని రోజులుగా ఈ బిల్డింగ్‌లకు రినోవేషన్ పనులు కొనసాగుతున్నాయి. కిటికీలను పూర్తిగా బయటి నుంచి క్లోజ్ చేశారు. నిర్మాణ పనుల కోసం బిల్డింగ్‌ల చుట్టూ వెదురు బొంగులను (scaffolding) కట్టారు. ఇవి సాధారణంగా నిర్మాణాల సమయంలో ఉపయోగిస్తారు. కాని, ఈ వెదురు బొంగులు మంటలు పట్టుకోడానికి చాలా సులభం.
అంతేకాక, కిటికీలకు పాలిస్టరైన్ బోర్డులను అమర్చారు. ఇవి వేడి ఆశ్రయించే, త్వరగా మండిపోయే లక్షణం కలిగిన పదార్థాలు. ఇవి అగ్ని ప్రమాదాల్లో ప్రధాన ప్రమాదకారకాలు. అనేక దేశాల్లో వీటి వినియోగం ఇప్పటికే నిషేధించారు. ఈ బోర్డ్స్ వల్లే ప్రమాదం విపరీతంగా వ్యాపించిందని హాంకాంగ్ అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.
బుధవారం మద్యాహ్నం ఆపార్ట్‌మెంట్‌లోని ఒక భాగంలో మంటలు కనిపించాయి. ఇవి క్షణాల్లోనే బయట గోడలకు అమర్చిన పాలిస్టరైన్‌కు అంటుకున్నాయి. కిటికీలు పూర్తిగా మూసి ఉండడంతో పొగ బయటకు వెళ్ళలేదు. లోపల పొగ నిండిపోయింది. వెంటనే మంటలు మరో అంతస్తులకు, మరో బిల్డింగ్ వైపుకు వ్యాపించాయి.
మంటలు వ్యాపించిన వేగం అగ్నిమాపక సిబ్బందిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అదృష్టవశాత్తు, వందలాది మంది నివాసితులను రక్షించగలిగారు. కాని, పలువురు గాయపడ్డారు. కొన్ని నివాసితులు తమ ఇళ్ల నుంచి బయటకు రావడం ఆలస్యం చేయడంతో చిక్కుకుపోయారు.
ప్రమాదానికి పాలిస్టరైన్ బోర్డులు ముఖ్య కారణమా అనే అంశంపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ బోర్డులను ఎందుకు అమర్చారు? అవి అగ్ని భద్రత ప్రమాణాలకు విరుద్ధమా? నిర్మాణ సంస్థ ఏమిటి? ఎవరు అనుమతులు ఇచ్చారు? వంటి విషయాలపై విచారణ జరుగుతోంది.
ఇది హాంకాంగ్‌లో ఇటీవల జరిగిన పెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత నగరంలోని పాత అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో అదనపు భద్రతా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్ని భద్రతా ప్రమాణాలు పాటించని భవనాలకు నోటీసులు ఇవ్వనున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న అన్ని కట్టడాలకు ప్రత్యేక తనిఖీలు జరగనున్నాయి.
Also read:

