దీపావళి (Diwali) పండుగను మూడు రోజుల పాటు జరుపుకొంటారు. మొదటి రోజు ధన త్రయోదశి , రెండో రోజు నరకచతుర్దశి, మూడో రోజు అమావాస్య లక్ష్మీ పూజలు.
ఈ సారి దీపావళి పండుగ రెండు రోజులు మాత్రమే వస్తుందని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 29వ తేదీన బుధవారం ధన త్రయోదశిని జరుపుకోవాల్సి ఉంటుంది. అశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశి అంటారు.
అక్టోబర్ 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు త్రయోదశి ఘడియలు మొదలవుతాయి. మరుసటి రోజు అంటే 30వ తేదీన మధ్యాహ్నం 12.35 గంటలకు త్రయోదశి ముగుస్తుంది. వెంటనే చతుర్దశి ప్రారంభం అవుతుంది. ధన లక్ష్మీపూజను సాధారణంగా సాయంత్రం చేస్తారు కాబట్టి సాయంత్రం వేళ త్రయోదశి తిథి ఉన్న మంగళవారం రోజే ధన త్రయోదశి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం 6:31 గంటల నుంచి రాత్రి 8:13 గంటల వరకు ధనత్రయోదశి పూజలకు అనుకూలమని అంటున్నారు. ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి, కుబేరుల విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ గంధం కుంకుమలతో అలంకరించి, ఆవు నేతితో దీపారాధన చేయాలి. సన్నజాజులు, కలువ పూలతో లక్ష్మీ దేవిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి.
సువాసనలు వెదజల్లే పన్నీరు, గంధ పుష్పాక్షతలను అమ్మవారికి సమర్పించాలి. ఆవు పాలు, పంచదార ఏలకులు, పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన క్షీరాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.

దీపావళి (Diwali) పండుగను మూడు రోజుల పాటు జరుపుకొంటారు. మొదటి రోజు ధన త్రయోదశి , రెండో రోజు నరకచతుర్దశి, మూడో రోజు అమావాస్య లక్ష్మీ పూజలు. ఈ సారి దీపావళి పండుగ రెండు రోజులు మాత్రమే వస్తుందని పండితులు చెబుతున్నారు.
అక్టోబర్ 29వ తేదీన బుధవారం ధన త్రయోదశిని జరుపుకోవాల్సి ఉంటుంది. అశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశి అంటారు. అక్టోబర్ 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు త్రయోదశి ఘడియలు మొదలవుతాయి.
మరుసటి రోజు అంటే 30వ తేదీన మధ్యాహ్నం 12.35 గంటలకు త్రయోదశి ముగుస్తుంది. వెంటనే చతుర్దశి ప్రారంభం అవుతుంది. ధన లక్ష్మీపూజను సాధారణంగా సాయంత్రం చేస్తారు కాబట్టి సాయంత్రం వేళ త్రయోదశి తిథి ఉన్న మంగళవారం రోజే ధన త్రయోదశి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం 6:31 గంటల నుంచి రాత్రి 8:13 గంటల వరకు ధనత్రయోదశి పూజలకు అనుకూలమని అంటున్నారు. ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవి, కుబేరుల విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ గంధం కుంకుమలతో అలంకరించి, ఆవు నేతితో దీపారాధన చేయాలి.
సన్నజాజులు, కలువ పూలతో లక్ష్మీ దేవిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. సువాసనలు వెదజల్లే పన్నీరు, గంధ పుష్పాక్షతలను అమ్మవారికి సమర్పించాలి.
ఆవు పాలు, పంచదార ఏలకులు, పచ్చకర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన క్షీరాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.
Also read:

