Manipur: మణిపూర్​లో భారీగా ఆయుధాలు స్వాధీనం

మణిపూర్​లో(Manipur) భద్రతాదళాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ఐదు జిల్లాల్లో తనిఖీలు చేసిన అధికారులు మొత్తం 328 తుపాకులు, మరో 9,300లకు పైగా వివిధ రకాల మందుగుండు సామాగ్రిని పట్టుకున్నారు. ఇంఫాల్​ వెస్ట్​, ఇంఫాల్​ ఈస్ట్​, తౌబాల్​, బిష్ణుపూర్​, కాక్​చింగ్​ జిల్లాల్లో భారీగా ఆయుధాలు ఉన్నాయన్న సమాచారం మేరకు మణిపూర్​ పోలీసులతో కలిసి ఆర్మీ, అస్సాం రైఫిల్స్​, బీఎస్​ఎఫ్​, సీఆర్​పీఎఫ్​, ఇండో–టిబెటన్​ సరిహద్దు పోలీసులు తనిఖీలు చేశారు(Manipur). భద్రతాదళాల తనిఖీల్లో 328 తుపాకులతో పాటు 151 సెల్ఫ్​ లోడింగ్​ రైఫిల్స్​, ఇతరత్రా ఆయుధాలు లభించినట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం మైతీ, కుకీ తెగల మధ్య మొదలైన ఘర్షణలతో మణిపూర్​ అట్టుడికిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘర్షణల్లో రెండు తెగల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు.

Also Read :