Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్​కౌంటర్​

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్​కౌంటర్​

10 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) దండకారణ్యం మళ్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లా కుంట బ్లాక్ బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధి అడవుల్లో ఇవాళ ఉదయం భారీ ఎన్​కౌంటర్​జరిగింది. మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. నిఘావర్గాల సమాచారం మేరకు బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్రాజుగూడ, దంతీసుపురం, నాగారం, భందార్పదర్ గ్రామ అడవులు, గుట్టల్లో సీఆర్పీఎఫ్, డీఆర్జీ బలగాలు కూంబింగ్ జరపగా.. వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో10 మంది మావోయిస్టులు నేలకొరిగారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3 ఆటోమేటిక్ గన్స్ తో పాటు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 10 డెడ్​బాడీలను గుర్తించామని కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ సుందర్రాజ్, సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు. మృతుల్లో కీలక నేతలు ఉన్నారని అనుమానం వ్యక్తంచేశారు. బలగాలు బయటకు వస్తేనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

ALso read: