చెరువులు, కుంటల ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని, వాటిని అరికట్టేందుకు హైడ్రా(Hydra) తరహా వ్యవస్థలను జిల్లాల్లోనూ కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. చెరువుల ఆక్రమణ క్షమించరాని నేరమని అన్నారు. చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని వివరించారు. చెరువులు, కుంటలు నాలాలు ఆక్రమించి భవనాలు నిర్మించుకున్న వారి జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ మహబూబాబాద్ లో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు.
చెరువు(Hydra) ఆక్రమణలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని అన్నారు. ఆక్రమణకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మంలో మాజీ మంత్రి ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని చెప్పారు. వాటిని తొలగింపజేసే దమ్ము మాజీ మంత్రి హరీశ్ రావుకు ఉందా..? అని ప్రశ్నించారు. ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ ఇంగ్లండ్ లో కూర్చొని ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు. వందల ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు బయల్దేరినట్టు హరీశ్ రావు ఖమ్మం టూర్ పెట్టుకున్నారని ఆరోపించారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. వరదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా బాధితుల వద్దకు వచ్చారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు మానవత్వం లేదని అన్నారు. వరద తగ్గుముఖం పట్టినందున బురదను తొలగించే పనులు వేగవంతం చేయాలని సూచించారు. కూలిపోయిన స్థంబాలు, ట్రాన్స్ ఫార్మర్లను పునరుద్ధరించి తక్షణమే విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మూడు తండాలు కలుపుతం
మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు కారణంగా మూడు తండాలు ముంపునకు గురవుతున్నాయని గుర్తించామని, వాటిని ఒకే ప్రాంతానికి తరలించి ఓ ఆదర్శ గ్రామాన్ని నిర్మిస్తామని సీఎం చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారు. జాతీయ విపత్తుగా భావించి ఐదు వేల కోట్ల పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. తక్షణ సాయంగా 2 వేల కోట్లు కోరినట్టు చెప్పారు.
జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ప్రధాన మంత్రిని రాష్ట్రానికి రావాలని కోరుతున్నట్టు సీఎం వెల్లడించా
Also read :
Mamata Banerjee: అపరాజిత బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం
SRSP: ఎస్సారెస్పీ గేట్లు ఖుల్లా
