ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు విసిరిన సవాల్‌ని తాను స్వీకరిస్తున్నట్లు మంత్రి (Jupalli Krishna Rao) జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. సీఎం రావాల్సిన అవసరం లేదని.. తానే చర్చకు వస్తానని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ తెలంగాణ ఆదాయం ఎంత? అవినీతి ఎంత? నాడు అప్పు ఎంత? ఎవరెవరు ఎంత దోచుకున్నారో అంతా చర్చిద్దామని స్పష్టం చేశారు. నగరంలోని లాల్‌బహుదూర్ స్టేడియం వేదికగా మీడియా సమక్షంలో 50 వేల మంది ప్రజలు చూసే విధంగా ఈ అంశంపై డిస్కస్చేద్దామని బీఆర్ఎస్ నేతలకు జూపల్లి సవాల్ విసిరారు. తన వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. మీ అవినీతి, అక్రమాలు, దోపిడికి సంబంధించిన అన్ని అంశాలను తాను రుజువు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్లో జరిగిన ప్రెస్ మీట్ లో జూపల్లి మాట్లాడుతూ ‘రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతుండని అంటున్నారు.
కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుండి వచ్చినవి? కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే కాకుండా హరీశ్ రావు మంత్రి అయి డ్యాన్స్ చేసిండు. మూసీ రివర్ ఫ్రంట్ లో రూ.50 వేల కోట్ల దోపిడీ జరిగిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చేలా.. కేసీఆర్ , కేటీఆర్, హరీశ్ రావులే నీతిమంతులన్నట్లు మాట్లాడుతున్నారు. ఈస్టమన్ కలర్ లాగా బావ, బామ్మర్దుల తీరు ఉంది. రాజకీయంగా దివాలా తీసిన వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు విసిరిన సవాల్‌ని తాను స్వీకరిస్తున్నట్లు మంత్రి (Jupalli Krishna Rao) జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. సీఎం రావాల్సిన అవసరం లేదని.. తానే చర్చకు వస్తానని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ తెలంగాణ ఆదాయం ఎంత? అవినీతి ఎంత? నాడు అప్పు ఎంత? ఎవరెవరు ఎంత దోచుకున్నారో అంతా చర్చిద్దామని స్పష్టం చేశారు. నగరంలోని లాల్‌బహుదూర్ స్టేడియం వేదికగా మీడియా సమక్షంలో 50 వేల మంది ప్రజలు చూసే విధంగా ఈ అంశంపై డిస్కస్చేద్దామని బీఆర్ఎస్ నేతలకు జూపల్లి సవాల్ విసిరారు.
తన వద్ద అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. మీ అవినీతి, అక్రమాలు, దోపిడికి సంబంధించిన అన్ని అంశాలను తాను రుజువు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్లో జరిగిన ప్రెస్ మీట్ లో జూపల్లి మాట్లాడుతూ ‘రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతుండని అంటున్నారు. కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుండి వచ్చినవి? కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే కాకుండా హరీశ్ రావు మంత్రి అయి డ్యాన్స్ చేసిండు. మూసీ రివర్ ఫ్రంట్ లో రూ.50 వేల కోట్ల దోపిడీ జరిగిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చేలా.. కేసీఆర్ , కేటీఆర్, హరీశ్ రావులే నీతిమంతులన్నట్లు మాట్లాడుతున్నారు. ఈస్టమన్ కలర్ లాగా బావ, బామ్మర్దుల తీరు ఉంది. రాజకీయంగా దివాలా తీసిన వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
Also read:

