మాజీ సీఎం కేసీఆర్(KCR) కు అరెస్టు భయం పట్టుకుందని, అందుకే రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణను వ్యతిరేకిస్తున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే విచారణ చేయుమని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాటమార్చుతున్నారని అన్నారు. కమిషన్ మీదే నమ్మకం లేదంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందని అన్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయితీకి మారుపేరని చెప్పారు. అవినీతి చేసినోళ్లను వదిలేయాలా… అని ప్రశ్నించారు. కవిత అవినీతి చేసింది కాబట్టే జైలుకు పోయిందని మంత్రి అన్నారు. కేసీఆర్ ప్రజల కొంపలు ముంచి లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కేటీఆరే దగ్గరుండి అమెరికా పంపారని అన్నారు. అన్ని లెక్కలు తీస్తుంటే కమిషన్లు రద్దు చేయాలనటం హాస్యాస్పదమని ఫైర్ అయ్యారు. అరెస్టు భయంతోనే కేసీఆర్ కమిషన్లు రద్దు చేయాలని అంటున్నారన్నారు. కేసీఆర్(KCR) కుటుంబమంతా జైలుకెళ్లడం ఖాయమని చెప్పారు. 30 వేల కోట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ లో రూ. 10 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని, ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
ALSO READ :

