(KTR) ఫార్ములా–ఈ వ్యవహారంలో తనపై కేసులు పెడితే పెట్టుకోవాలని, రెండునెలలు జైల్లో ఉండి, యోగా చేసుకొని ట్రిమ్ అయి వస్తానని, ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ-రేస్ అనేది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతోందని అన్నారు. ఈ నగరాల సరసన హైదరాబాద్ ను చేర్చాలని తాము ఈ-రేస్ ను ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేశామని అన్నారు. తాము ఈ-రేస్ కోసం ప్రభుత్వం తరఫున చేసిన ఖర్చు కేవలం రూ. 40 కోట్లు మాత్రమేనని అన్నారు.
కానీ హైదరాబాద్ కు రూ. 700 కోట్ల ప్రయోజనం చేకూరిందని అన్నారు. ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ గ్రీన్ కో అనే సంస్థ మాత్రం తమకు లాభం రాలేదని పక్కకు తప్పుకుందన్నారు. గ్రీన్ కో సంస్థ వెళ్లిపోవటంతో ఈ-రేస్ పోకుండా ఉండేందుకు ఆ డబ్బులను ఇద్దామని అర్వింద్ కుమార్ కు చెప్పానన్నారు. ఈ మేరకు రూ. 55 కోట్లు చెల్లించామని చెప్పారు. హెచ్ఎండీఏకు డబ్బులు ఇచ్చిన సంగతి తెలుసునని అన్నారు. హెచ్ఎండీఏ స్వతంత్ర బోర్డు అని, వాళ్లు ఖర్చు చేసే డబ్బులకు కేబినెట్ అప్రూవల్ అవసరం లేదని కేటీఆర్ చెప్పారు. ఈ-రేస్ కారణంగా 49 దేశాల్లో హైదరాబాద్ పేరు తెలిసేలా చేశామని చెప్పారు. ఎన్నో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశామని అన్నారు.
తమకు కూల్చడం, విధ్వంసం చేయడం తెలియదని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే ఆ ప్రాజెక్టు రద్దు చేశారని, దాంతో రూ. 700 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డికి ఏసీబీ ఫుల్ ఫాం తెలియదని, దానిని ఎక్కడ వాడాలో కూడా తెలియదని అన్నారు. తాము చేసిన దాంట్లో అవినీతి ఏముందని, తమకు ఏమొచ్చిందని (KTR) కేటీఆర్ ప్రశ్నించారు. మాట్లాడితే ఒలింపిక్స్ హైదరాబాద్ లో నిర్వహిస్తామంటున్నారని, దానికి ఎంత ఖర్చవుతుందో ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. నిజానికి కేసులు పెట్టాలంటే మేఘా, రాఘవ కంపెనీల మీద పెట్టాలని డిమాండ్ చేశారు.
ఫార్ములా ఈ రేసు జరగకుండా రద్దు చేసి హైదరాబాద్ ఖ్యాతిని దెబ్బతీసిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలని అన్నారు. సీఎం విశ్వనగరానికి ఇమేజ్ లేకుండా చేస్తున్నారని, దాంతో పెట్టుబడులు రావడం లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ ను ఖతం చేయాలని రాజ్ భవన్ లో ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకే రాజ్ భవన్ వేదికగా మంతనాలు సాగిస్తున్నారని అన్నారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని, ప్రజల తరఫున పోరాడుతానని స్పష్టం చేశారు.
700 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డికి ఏసీబీ ఫుల్ ఫాం తెలియదని, దానిని ఎక్కడ వాడాలో కూడా తెలియదని అన్నారు. తాము చేసిన దాంట్లో అవినీతి ఏముందని, తమకు ఏమొచ్చిందని (KTR) కేటీఆర్ ప్రశ్నించారు. మాట్లాడితే ఒలింపిక్స్ హైదరాబాద్ లో నిర్వహిస్తామంటున్నారని, దానికి ఎంత ఖర్చవుతుందో ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. నిజానికి కేసులు పెట్టాలంటే మేఘా, రాఘవ కంపెనీల మీద పెట్టాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేసు జరగకుండా రద్దు చేసి హైదరాబాద్ ఖ్యాతిని దెబ్బతీసిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలని అన్నారు.
సీఎం విశ్వనగరానికి ఇమేజ్ లేకుండా చేస్తున్నారని, దాంతో పెట్టుబడులు రావడం లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ ను ఖతం చేయాలని రాజ్ భవన్ లో ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకే రాజ్ భవన్ వేదికగా మంతనాలు సాగిస్తున్నారని అన్నారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని, ప్రజల తరఫున పోరాడుతానని స్పష్టం చేశారు.
Also read:

