భారత సాంకేతిక రంగంలో మరో విశేష ఆవిష్కరణకు ఐఐటీ–హైదరాబాద్ (IIT Hyderabad) నాంది పలికింది. అత్యవసర పరిస్థితుల్లో మనుషులను రక్షించడం, ఔషధాలు, ఆహారం తరలించడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘హ్యూమన్ డ్రోన్’ అభివృద్ధి పనుల్లో 80 శాతం పూర్తయిందని (IIT Hyderabad) ఐఐటీ స్టూడెంట్స్ వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్ ఎక్స్ పోలో ఈ హ్యూమన్ డ్రోన్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించగా, ఇది దేశవ్యాప్తంగా విశేష స్పందనను అందుకుంది.
ఈ డ్రోన్‌ను ఒక వ్యక్తి కుర్చీల్లాంటి ప్రత్యేక సీటులో కూర్చొని ప్రయాణించగలిగేలా డిజైన్ చేస్తున్నారు. సాధారణ డ్రోన్ల కంటే ఇది పెద్దది, శక్తివంతమైన మోటార్లతో, అధునాతన బ్యాటరీ సిస్టమ్‌తో రూపొందించబడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన రక్షణ కార్యకలాపాలకు ఇది గేమ్ చేంజర్‌గా మారుతుందని ఐఐటీ స్టూడెంట్స్ భావిస్తున్నారు.
ప్రస్తుతం హ్యూమన్ డ్రోన్‌పై ఆర్ అండ్ డీ పనులు ఐఐటీ–హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్‌లో వేగంగా కొనసాగుతున్నాయి. వరదలు, భూకంపాలు లేదా ఇతర ప్రమాదాల సమయంలో చిక్కుకున్నవారికి డ్రోన్ సహాయంతో ఆహారం, నీరు, ఔషధాలు అందించగలమని స్టూడెంట్స్ వివరించారు. ఇంకా భవిష్యత్తులో ఈ హ్యూమన్ డ్రోన్‌ను చిన్న ఎయిర్ అంబులెన్స్‌లాగా ఉపయోగించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
ఇది మొత్తం ఎలక్ట్రిక్ వ్యవస్థతో పనిచేయడం వల్ల పర్యావరణానికి హానికరం కాని ప్రయాణ సౌకర్యంగా కూడా మారవచ్చు. 120 నుండి 150 కిలోల బరువును మోయగలిగే సామర్థ్యంతో ఇది తయారవుతుందని సమాచారం. తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం కూడా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు.
అత్యవసర వైద్య సేవల (EMS), రక్షణ సంస్థలు, విపత్తు నిర్వహణ విభాగాలు వంటి కీలక రంగాల్లో హ్యూమన్ డ్రోన్ వినియోగం విప్లవాత్మక మార్పులను తీసుకురావొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో రోగులను వేగంగా ఆసుపత్రికి తరలించడంలో కూడా ఈ డ్రోన్ ప్రయోజనకరంగా ఉంటుంది.
ఐఐటీ విద్యార్థుల ఈ సృజనాత్మక ఆవిష్కరణ అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠను మరింత పెంచుతుంది. త్వరలో చివరి టెస్టింగ్ పూర్తి చేసి, ఈ డ్రోన్‌ను మార్కెట్‌కు తీసుకురానున్నట్లు ఐఐటీ టీమ్ ప్రకటించింది.
Also read:
