India: రంగంలోకి భారత నేవీ..

India

పహెల్గాం దాడి నేపథ్యంలో (India) భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. భారత నావికా దళం మరోమారు యుద్ధానికి సన్నద్ధతను ప్రకటించింది. త్రిశూల శక్తితో మేం సిద్ధంగా ఉన్నామంటూ ట్టిట్టర్ వేదికగా సంకేతాలు ఇచ్చింది. ఇందుకు ఓ ఫొటోను కూడా జోడించింది. ఒక నౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ మూడూ ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ధ్రువ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్ , స్కార్పీన్‌ తరగతికి చెందిన జలాంతర్గామి. దీనికి ట్యాగ్ లైన్ గా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా అని రాసుకొచ్చింది. దీని అర్థం.. (India) భారత నేవీ త్రిశూల శక్తి అని, సముద్రం పైన.. కింద.. అలల మీద ఎక్కడైనా అని అర్థం వచ్చేలా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టేలా గతంలో ఐఎన్ ఎస్ విక్రాంత్ ను మోహరించిన భారత నావికాదళం ఇవాళ త్రిశూల శక్తిని సముద్రంలో ప్రదర్శించడం విశేషం. ఉగ్ర ఘటన తర్వాత నుంచి భారత సైన్యం శక్తి సామర్థ్యాలను చాటిచెప్పే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అధికారులు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

పాక్ నౌకలపై నిషేధం.. సముద్ర మార్గం బంద్
పాకిస్తాన్‌తో సముద్ర రవాణా మార్గాలను భారత్‌ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం, 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అటు భారత ఓడలు కూడా పాక్‌ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్‌ విమానాలకు మన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.

పహెల్గాం దాడి నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. భారత నావికా దళం మరోమారు యుద్ధానికి సన్నద్ధతను ప్రకటించింది. త్రిశూల శక్తితో మేం సిద్ధంగా ఉన్నామంటూ ట్టిట్టర్ వేదికగా సంకేతాలు ఇచ్చింది. ఇందుకు ఓ ఫొటోను కూడా జోడించింది. ఒక నౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ మూడూ ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ధ్రువ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్ , స్కార్పీన్‌ తరగతికి చెందిన జలాంతర్గామి. దీనికి ట్యాగ్ లైన్ గా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా అని రాసుకొచ్చింది. దీని అర్థం.. భారత నేవీ త్రిశూల శక్తి అని, సముద్రం పైన.. కింద.. అలల మీద ఎక్కడైనా అని అర్థం వచ్చేలా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టేలా గతంలో ఐఎన్ ఎస్ విక్రాంత్ ను మోహరించిన భారత నావికాదళం ఇవాళ త్రిశూల శక్తిని సముద్రంలో ప్రదర్శించడం విశేషం. ఉగ్ర ఘటన తర్వాత నుంచి భారత సైన్యం శక్తి సామర్థ్యాలను చాటిచెప్పే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అధికారులు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.పాక్ నౌకలపై నిషేధం.. సముద్ర మార్గం బంద్
పాకిస్తాన్‌తో సముద్ర రవాణా మార్గాలను భారత్‌ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం, 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అటు భారత ఓడలు కూడా పాక్‌ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్‌ విమానాలకు మన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.

పహెల్గాం దాడి నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. భారత నావికా దళం మరోమారు యుద్ధానికి సన్నద్ధతను ప్రకటించింది. త్రిశూల శక్తితో మేం సిద్ధంగా ఉన్నామంటూ ట్టిట్టర్ వేదికగా సంకేతాలు ఇచ్చింది. ఇందుకు ఓ ఫొటోను కూడా జోడించింది. ఒక నౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ మూడూ ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ధ్రువ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్ , స్కార్పీన్‌ తరగతికి చెందిన జలాంతర్గామి. దీనికి ట్యాగ్ లైన్ గా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా అని రాసుకొచ్చింది. దీని అర్థం.. భారత నేవీ త్రిశూల శక్తి అని, సముద్రం పైన.. కింద.. అలల మీద ఎక్కడైనా అని అర్థం వచ్చేలా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. దాయాది దేశం వెన్నులో వణుకు పుట్టేలా గతంలో ఐఎన్ ఎస్ విక్రాంత్ ను మోహరించిన భారత నావికాదళం ఇవాళ త్రిశూల శక్తిని సముద్రంలో ప్రదర్శించడం విశేషం. ఉగ్ర ఘటన తర్వాత నుంచి భారత సైన్యం శక్తి సామర్థ్యాలను చాటిచెప్పే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అధికారులు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also read: