యూరోపియన్ యూనియన్ (ఈయూ) (India EU) నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ ప్రస్తుతం వసూలు చేస్తున్న భారీ సుంకాలను గణనీయంగా తగ్గించే దిశగా అడుగులు వేస్తోందని రాయిటర్స్ వెల్లడించింది. దీనిపై ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం (India EU) ఈయూ కార్లపై 110 శాతం టారిఫ్ వసూలు చేస్తుండగా, దీనిని సగానికి పైగా తగ్గించి దాదాపు 40 శాతం వరకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
ఈ నిర్ణయం యూరోపియన్ యూనియన్ దేశాలతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ – FTA)లో భాగంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం మంగళవారం నాటికి ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని రాయిటర్స్ పేర్కొంది. ఈయూలోని 27 దేశాల నుంచి దిగుమతి అయ్యే, ధర రూ.16.3 లక్షలు దాటిన కొన్ని కేటగిరీల కార్లపై ఈ టారిఫ్ తగ్గింపును కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ సుంకాల కోత దశలవారీగా అమలు చేయనున్నారని, భవిష్యత్తులో ఇవి మరింత తగ్గి 10 శాతం వరకు చేరే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దిగుమతి అడ్డంకులను తగ్గించాలని వోక్స్వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ప్రముఖ యూరోపియన్ ఆటో దిగ్గజాలు చాలా కాలంగా భారత్‌ను కోరుతున్న విషయం తెలిసిందే.
వారి డిమాండ్లకు అనుగుణంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈయూతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకునే దిశగా ముందడుగు వేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ టారిఫ్ తగ్గింపుతో భారత మార్కెట్లో యూరోపియన్ ఆటోమేకర్స్ వ్యాపార కార్యకలాపాలకు మరింత వెసలుబాటు లభిస్తుందని రాయిటర్స్ అంచనా వేసింది. దీంతో కార్ల దిగుమతులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్ రంగంలో పోటీ మరింత పెరగడంతో భవిష్యత్తులో కార్ల ధరలు తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.
ఈ టారిఫ్ తగ్గింపుతో భారత మార్కెట్లో యూరోపియన్ ఆటోమేకర్స్ వ్యాపార కార్యకలాపాలకు మరింత వెసలుబాటు లభిస్తుందని రాయిటర్స్ అంచనా వేసింది. దీంతో కార్ల దిగుమతులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆటోమొబైల్ రంగంలో పోటీ మరింత పెరగడంతో భవిష్యత్తులో కార్ల ధరలు తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వాణిజ్య విధానాలు, అదనపు టారిఫ్ పెంపుల వల్ల ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత్ ఈయూతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయాలని చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కు భారత్ మొగ్గు చూపడం ఆటోమొబైల్ మార్కెట్‌కు కీలక మలుపుగా మారే అవకాశముందని అంటున్నారు.
Also read:

