India: యుద్ధ మేఘాలు.. ఏక్షణమైనా వార్!

India

(India) భారత్–పాకిస్తాన్ బార్డర్ లో హైటెన్షన్ నెలకొంది. నియంత్రణ రేఖ వద్ద పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్ పోస్టు లపైన కాల్పులకు తెగ బడింది. (India) భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. యుద్ధవాతావరణం నెలకొనడంతో సైన్యానికి సెలవులు రద్దు చేశారు. సెలవుపై వెళ్లిన వారు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సైన్యం అలెర్టయ్యింది. మరో వైపు కాశ్మీర్ మొత్తాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఆర్మీ చీఫ్ ద్వివేది హుటాహుటిన శ్రీనగర్ చేరుకున్నారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎల్వోసీ వద్ద అన్ని మిలిటరీ విభాగాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.

టెర్రరిస్ట్ ఆసిఫ్ షేక్ ఇంట్లో పేలుడు
పహెల్గాం దాడిలో నిందితులుగా ఉన్న ఉగ్రవాదుల నివాసాల్లో భద్రతా దళాలు తఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే దక్షిణ కశ్మీర్‌లోని త్రాల్‌కు చెందిన ఆసిఫ్ షేక్‌ ఇంటికి వెళ్లగా, అక్కడ పేలుడు పదార్థాలు ఉన్నాయని గుర్తించారు. అవి యాక్టివేట్ అయినట్లు తెలియడం వల్ల అప్రమత్తమైన భద్రతా బలగాలు బయటకు వచ్చేశాయి. కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో ఆర్మీ జవాన్లకు హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లల్లో పేలుడు పదార్థాలు అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

కాల్పుల్లో ఉగ్రవాది హతం
జమ్మూ లోని దిపోరాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని భద్రతా దళాలు అంతమొందించాయి. అంతకు ముందు బజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టారు.

కాల్పుల్లో ఉగ్రవాది హతం
జమ్మూ లోని దిపోరాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని భద్రతా దళాలు అంతమొందించాయి. అంతకు ముందు బజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టారు.

Also read;