Bangladesh: బంగ్లాలో భారతీయులు సేఫ్​

పొరుగునే ఉన్న బంగ్లాదేశ్(Bangladesh) పరిణామాలపై ఇవాళ కేంద్ర ప్రభుత్వ పార్లమెంటు హాలులో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. ఆ దేశంలో ప్రస్తుతం బీఎన్‌పీ-జమాతే కూటమి అధికారాన్ని చేపట్టబోతుందంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కూటమి పగ్గాలు చేపడితే ఆ ప్రభావం భారత్‌పై పడే అవకాశం ఉన్నట్టు పలువురు పేర్కొంటున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీకి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. (Bangladesh) బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితిని జైశంకర్ వారికి వివరించినట్టు తెలుస్తోంది. అక్కడి భారతీయులను స్వదేశానికి రప్పించాలా లేదా అన్ని విషయంపై కూడా చర్చించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే బంగ్లాదేశ్ లో 13 వేల మంది భారతీయులున్నారని, ఇప్పటికే 8 వేల మంది ఇండియాకు సురక్షితంగా చేరుకున్నారని, అక్కడున్న వాళ్లకూ ఎలాంటి ప్రమాదం లేదని జై శంకర్ సమావేశంలో వివరించారు. భారత ప్రభుత్వం భారతీయ పౌరులతో టచ్‌లో ఉందని, అక్కడి హైకమిషన్ కార్యకలాపాలు కొనసాగిస్తోందని జైశంకర్ సమావేశానికి తెలియజేశారు.

Also read: