రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. (Inter first year) ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకూ ఈసారి ల్యాబ్ ప్రాక్టికల్స్ మరియు ఇంటర్నల్ మార్కులు తప్పనిసరి చేసింది. 12 ఏళ్ల తర్వాత సిలబస్‌లో మార్పులు చేస్తూ (Inter first year) బోర్డు కొత్త విధానం ప్రకటించింది.
ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి.
ఫీజు చెల్లింపులు నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఫిబ్రవరి మొదటి వారం నుంచే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ మొదలవుతాయి.
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో 20% ఇంటర్నల్ మార్కులు కేటాయించనున్నారు.
NCERT నిబంధనల ఆధారంగా కొత్త సిలబస్ రూపొందించనున్నారు.
డిసెంబర్ 15 నాటికి సిలబస్‌ను తెలుగు అకాడమీకి అందజేస్తారు.
కొత్త పుస్తకాలు ఏప్రిల్ నెలాఖరులో మార్కెట్‌లోకి రానున్నాయి.
ల్యాబ్ ప్రాక్టికల్స్ ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఉండనున్నాయి.
ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ, “ప్రతి చాప్టర్‌కి QR కోడ్‌తో డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. 2026 నుంచి కొత్తగా ACE గ్రూప్, అకౌంటెన్సీ గ్రూప్ ప్రారంభం కానున్నాయి” అని వెల్లడించారు.
గత ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగినప్పటికీ, ఈసారి ఎగ్జామ్స్ 8 రోజులు ముందుగానే ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Also read:

