Iocl: ఇంధనం కొరత లేదు

Iocl

యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా చమురు నిల్వల్లో కొరత ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పెట్రోలు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఇంధన కొరత ప్రచారాలపై ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (Iocl) స్పందించింది. ఇంధన నిల్వల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమవద్ద తగినంత నిల్వలు ఉన్నట్లు ప్రకటించింది. ఇంధనం, ఎల్‌పీజీ తమ అన్ని అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉన్నాయని వివరించింది.  ఆయిల్ లైన్లు సజావుగా పనిచేస్తున్నా యి.(Iocl) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలను కలిగి ఉంది. మరియు మా సరఫరా లైన్లో సజావుగా పనిచేస్తున్నాయి. భయపడి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు మా అన్ని అవుట్ లైన్ లో ఇంధనం మరియు LPG తక్షణమే అందుబాటులో ఉన్నాయి అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపారు.

 

యుద్ధ సమయాల్లో బ్లాక్ అవుట్ అనే పదం తరుచుగా వాడుతూ ఉంటారు. శత్రువుల నిఘా నుంచి ప్రజలను రక్షించే ఉద్దేశంతో ప్రకటించే ఈ బ్లాక్‌ అవుట్‌తో యుద్ధ సమయంలో శత్రువుల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులకు మన ప్రాంతాలు కనిపించకుండా ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశం. ఆయా ప్రాంతాలను పూర్తి చీకట్లోకి నెట్టేయడాన్నే బ్లాక్‌ అవుట్‌ అంటారు. ఈ సమయంలో మొత్తం పవర్‌ కట్‌ చేస్తారు. వాహనాలను కూడా లైట్లు వేసుకొని తిరిగేందుకు అనుమతి ఇవ్వరు. దీని ద్వారా శత్రువులు మన ప్రాంతాలను గుర్తించడం కష్టంగా మారుతుంది. బ్లాక్ అవుట్ అమల్లోకి వస్తే ఆర్మీ సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Image

“ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలను కలిగి ఉంది మరియు మా సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయి. భయపడి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు – మా అన్ని అవుట్‌లెట్లలో ఇంధనం మరియు LPG తక్షణమే అందుబాటులో ఉన్నాయి” అని అన్నారు.

Also read: