IPL 2025: ఐపీఎల్ కు ఉప్పల్‌ రెడీ.. మ్యాచులు ఎప్పుడంటే?

IPL 2025

ఐపీఎల్ 2025 (IPL 2025) మహా సంగ్రామం రేపటి నుంచి షురూ కానుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కాగా.. ఆదివారం (ఎల్లుండి) సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు నిర్వహించున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ (IPL 2025) మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ మ్యాచ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి
రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు.

Image‘ఉప్పల్​లో ఐపీఎల్ మ్యాచ్ ల కోసం 2,700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. ఇందులో 300 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్లో 1,218 మంది, 12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ ఉన్నారు. ఉప్పల్ స్టేడియంలో 450 సీసీ కెమెరాలతో నిత్యం నిఘా ఉంటుంది. అక్కడే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసిం. స్టేడియం ఎంట్రెన్స్ వద్ద స్నిఫర్ డాగ్స్ తో పాటు బాంబ్ స్వ్కాడ్​తనిఖీలు చేపడుతాయి’ అని సీపీ తెలిపారు.

Image

మఫ్టీలో షీ టీమ్స్
మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్ బృందాలు ఏర్పాటుచేశాం. అలాగే.. మ్యాచ్ కోసం వచ్చే అభిమానులకు ఐదు చోట్ల స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించాం. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యా్ప్ టాప్, మ్యాచ్ బాక్స్, అంబ్రెల్లా, ఎలక్ట్రానిక్ వస్తువులు పర్మిషన్​లేదు. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రతి మ్యాచ్ కు మూడు గంటల ముందు స్టేడియం గేట్లు ఓపెన్ చేస్తం. ప్రేక్షకులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ ను వినియోగించుకోవాలి. మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో తినుబండారాలపై విపరీతమైన రేట్లు ఉంటున్నాయని గుర్తించాం.. ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నం. స్టేడియం బయట ఎవరైనా టికెట్లను విక్రయిస్తున్నట్లుగా తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటం. మొత్తం 19 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నం’ అని తెలిపారు.

Image