కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు రానుందని సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యను తొలగించి డీకే శివకుమార్‌ను సీఎంగా నియమించాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ (Iqbal hussain)తీవ్రంగా అభిప్రాయపడ్డారు. డీకే శివకుమార్‌కు ఇప్పటికే భారీ మద్దతు ఉందని, ఆయన లేకపోతే 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఆయన హెచ్చరించారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి వచ్చిన సంకేతాల ప్రకారం, డీకే శివకుమార్‌ను సీఎం చేయాలనే ఊసులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యేలను కలిసి భేటీ కావడానికి సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి ముందు పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.(Iqbal hussain)
ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, “డీకే శివకుమార్ పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. ఆయన నిబద్ధత, కృషి వల్లే పార్టీకి నేడు ఈ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఆయన నాయకత్వంలో మంచి పాలన సాధ్యమవుతుందని చాలా మంది ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు. అందుకే ఆయనను సీఎంగా చూడాలనుకుంటున్నారు” అని తెలిపారు.
అంతేకాదు, “ఈ విషయాన్ని త్వరలో జరిగే కాంగ్రెస్ హైకమాండ్ సమావేశంలో ప్రస్తావించనున్నాను. ఇప్పుడు మార్పు తీసుకురావడం అవసరం. ప్రజలు, కార్యకర్తలు కూడా మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింటుంది” అని హుస్సేన్ స్పష్టం చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంతర్యంగా ఒక నిర్ణయానికి వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. డీకే శివకుమార్‌కు మద్దతుగా ఏర్పడుతున్న ఎమ్మెల్యేల బలంతో, సీఎం పదవి మార్పు తథ్యమేననే అభిప్రాయం బలపడుతోంది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read :

