Iran: శ్రీలంక గల్లె సమీపంలో ఇరాన్ నౌక ప్రమాదం

Iran

శ్రీలంక తీరానికి సమీప అంతర్జాతీయ జలాల్లో (Iran) ఇరాన్ నౌకాదళానికి చెందిన ఓ యుద్ధ నౌకపై జలాంతర్గామి దాడి జరిగినట్లు సమాచారం వెలువడింది. ఈ ఘటన పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీలంక విదేశాంగ మంత్రి Vijitha Herath పార్లమెంటులో ఈ విషయాన్ని వెల్లడించారు.దక్షిణ శ్రీలంక తీరంలోని Galle సమీప సముద్ర ప్రాంతంలో (Iran) ఇరాన్ నౌకాదళానికి చెందిన IRIS Dena నౌక ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. ఉదయం 5.08 గంటలకు ఆపద సంకేతం అందిందని, వెంటనే Sri Lanka Navy మరియు Sri Lanka Coast Guard అప్రమత్తమయ్యాయని మంత్రి వివరించారు.

Image

ఉదయం 6 గంటలకు తొలి నౌకను, 7 గంటలకు మరో నౌకను ఘటనాస్థలానికి పంపినట్లు తెలిపారు. రక్షణ చర్యల్లో Sri Lanka Air Force కూడా భాగస్వామ్యమైంది. ప్రమాద సమయంలో తీవ్ర స్థితిలో ఉన్న సుమారు 30 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసి గల్లె నావల్ కమాండ్ కేంద్రానికి తరలించారు. అనంతరం వారిని అంబులెన్సుల ద్వారా కరపిటియ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.మొత్తం నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారని సమాచారం. గల్లంతైన వారి కోసం సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాడి వెనుక ఎవరు ఉన్నారు, ఏ కారణంతో ఈ ఘటన చోటుచేసుకుంది అనే అంశాలపై విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం అధికారికంగా దాడి చేసిన దేశం లేదా గ్రూప్‌పై స్పష్టత లేదు.

Image

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం, 1979 సముద్ర శోధన–రక్షణ ఒప్పందానికి శ్రీలంక సంతకం చేసిన దేశమని మంత్రి గుర్తుచేశారు. జాతీయ సముద్ర సరిహద్దులను మించి ప్రమాదంలో ఉన్న ఏ దేశ నౌకైనా సహాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

Image

ఇదిలా ఉండగా, ఇరాన్ నౌకాదళానికి చెందిన మరో యుద్ధ నౌక ఇటీవల విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. తాజా ఘటనతో హిందూ మహాసముద్ర ప్రాంత భద్రతపై చర్చ మళ్లీ మొదలైంది.

Also read: