బీఆర్ఎస్.. రావుల పార్టీయా.. రేవ్ పార్టీ యా అనేది వాళ్ళకే తెలియాలని మంత్రి (Komati Reddy Venkat Reddy) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తప్పు చేయకుంటే కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు ఎందుకు భయమని అన్నారు. ఆయనను కేటీఆరే దాచారని ఆరోపించారు. హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తాము విద్యుత్ చార్జీలు పెంచుతాం అన్నట్టు, బీ ఆర్ ఎస్ ఆందోళన చేసి తగ్గించినట్లు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావడం లేదని విమర్శించారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… త్వరలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చెప్పారు. టానిక్ షాపు కేటీఆర్ బినామీదేనని అన్నారు. కులగణనతో 50శాతం పైబడి ఉన్న బీసీలకు మేలు జరగబోతోందని అన్నారు. తమ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ఎస్ నేతలు విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు.
బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో హామీ ఇవ్వని కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. కులగణనలో పార్టీలకు అతీతంగా నేతలంతా పాల్గొని సహకరించాలని అన్నారు. దీనిపై కేసీఆర్ ఫాంహౌస్ నుంచి కనీసం ప్రెస్ నోట్ అయినా విడుదల చేయాలని, లేకుంటే ఆ పార్టీ కనుమరుగవటం ఖాయమని అన్నారు.

Also Read :