KCR : పెద్దపాము మింగినట్లయింది

It looks like a big snake has swallowed.

తెలంగాణ ప్రజలు తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కు ఓట్లేశారని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)అన్నారు. అత్యాశకు పోయి ఆగమైండ్రని చెప్పారు. తాను చెబితే ప్రజలు వినలేదని అన్నారు. ఇవాళ జహీరాబాద్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఎర్రవల్లి ఫాంహౌస్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కైలాసంలో పెద్దపాము మింగినట్లయిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇదో మంచి గుణపాఠమని చెప్పారు. కొందరు అత్యాశకు పోయి చెప్పుడు మాటలు విని మోసపోయారని చెప్పారు. రైతు భరోఆ ఇస్తారో లేదో..? ఇచ్చానా అదీ మోసమేనని అన్నారు. రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏటా పెరిగిందని, ఇప్పుడు 13 వేల కోట్ల ఇంకమ్ పడిపోయిందని కాగ్ నివేదికలో పేర్కొందని కేసీఆర్ (KCR)చెప్పారు. పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయని అన్నారు. మరో నాలుగు నెలలైతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని అన్నారు. భూముల ధరలు బాగా పడిపోయాయని, రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బతిన్నదని అన్నారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారని, దీంతో పిల్లలను తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారని చెప్పారు. మళ్లీ పాత కాంగ్రెస్ మోపైందని చెప్పారు. కరెంటు కోతలు ఉన్నాయని, మంచినీళ్లు సరిగా రావడం లేదని అన్నారు. ఇప్పుడే కరెంటు కోతలుంటే.. ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏమిటని అన్నారు.

ECI bans former Telangana CM K Chandrashekar Rao from campaigning for 48  hours | India News - Times of India

కొడితే మామూలుగా ఉండదు
ఇన్ని రోజులు తాను మౌనంగా, గంభీరంగా ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, ఆ పార్టీ వాళ్లు దొరికితే కొట్టేటట్టు ఉన్నారని అన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు ట్విట్టర్ లో పోల్ పోడితే మనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. రైతు బంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీం చెబుతారని ఆనాడే చెప్పానన్నారు. రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయని చెప్పారు. కాళేశ్వరం ఇలా అన్ని ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని అన్నారు. సంగమేశ్వరం, బసవేశ్వరం ప్రాజెక్టుల కోసం పోరాడుతామని పిలుపునిచ్చారు. రాబోయే ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కేసీఆర్ (KCR)చెప్పారు. తాను కొడితే మామాలుగా కాదు గట్టిగా కొట్టడం తనకు అలవాటని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావుతోపాటు కోహిర్, జహీరాబాద్, ఝరాసంఘం, మొగుడం పల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

కొడితే మామూలుగా ఉండదు
ఇన్ని రోజులు తాను మౌనంగా, గంభీరంగా ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, ఆ పార్టీ వాళ్లు దొరికితే కొట్టేటట్టు ఉన్నారని అన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు ట్విట్టర్ లో పోల్ పోడితే మనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. రైతు బంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీం చెబుతారని ఆనాడే చెప్పానన్నారు. రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయని చెప్పారు. కాళేశ్వరం ఇలా అన్ని ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని అన్నారు. సంగమేశ్వరం, బసవేశ్వరం ప్రాజెక్టుల కోసం పోరాడుతామని పిలుపునిచ్చారు. రాబోయే ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కేసీఆర్ చెప్పారు. తాను కొడితే మామాలుగా కాదు గట్టిగా కొట్టడం తనకు అలవాటని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావుతోపాటు కోహిర్, జహీరాబాద్, ఝరాసంఘం, మొగుడం పల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Also read :

Hyderabad: గ్రేటర్ లో గెలుస్తం

Budget: పార్లమెంటులో 16 బిల్లులు