కొత్త ఐటీ (IT) పాలసీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది పన్ను చెల్లింపు దారులకు మేలు చేసేదిలా కనిపించినా.. ఇక అణువణువూ గాలిస్తామంటోంది ఐటీ (IT) శాఖ. మెయిల్, సోషల్ మీడియా, ట్రేడింగ్ ఖాతాల యాక్సెస్ కూడా తీసుకోనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఇన్ కమ్ ట్యాక్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లు చట్టంగా మారేముందు దానిని సెలెక్ట్ కమిటీ సమీక్షకు పంపారు. ఇందులో ఆందోళనకరమైన విషయం ఏంటంటే పన్ను శోధన పరిధిని విస్తరించే నిబంధన.. ఆదాయపన్ను ఎగవేత దారులను గుర్తించే క్రమంలో ఈ మెయిల్స్, ట్రేడింగ్ ఖాతాలు, సోషల్ మీడియా ప్రొఫైల్ అన్నింటిని పరిశీలించే అధికారం ఆఫీసర్లకు ఉంటుంది. కొత్త ఆదాయపు పన్ను బిల్లులోని నిబంధన 247 ప్రకారం పన్ను ఎగవేత, ట్యాక్స్ చెల్లించని ఆస్తులను గుర్తించినట్లయితే వారి ఈ మెయిల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ వివరాలు , పెట్టుబడి ఖాతాలను ఆదాయపు పన్ను అధికారులు యాక్సెస్ చేసుకొని చెక్ చేసే రైట్ ఉంటుంది.

కొత్త ఐటీ పాలసీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది పన్ను చెల్లింపు దారులకు మేలు చేసేదిలా కనిపించినా.. ఇక అణువణువూ గాలిస్తామంటోంది ఐటీ శాఖ. మెయిల్, సోషల్ మీడియా, ట్రేడింగ్ ఖాతాల యాక్సెస్ కూడా తీసుకోనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఇన్ కమ్ ట్యాక్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లు చట్టంగా మారేముందు దానిని సెలెక్ట్ కమిటీ సమీక్షకు పంపారు. ఇందులో ఆందోళనకరమైన విషయం ఏంటంటే పన్ను శోధన పరిధిని విస్తరించే నిబంధన.. ఆదాయపన్ను ఎగవేత దారులను గుర్తించే క్రమంలో ఈ మెయిల్స్, ట్రేడింగ్ ఖాతాలు, సోషల్ మీడియా ప్రొఫైల్ అన్నింటిని పరిశీలించే అధికారం ఆఫీసర్లకు ఉంటుంది. కొత్త ఆదాయపు పన్ను బిల్లులోని నిబంధన 247 ప్రకారం పన్ను ఎగవేత, ట్యాక్స్ చెల్లించని ఆస్తులను గుర్తించినట్లయితే వారి ఈ మెయిల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ వివరాలు , పెట్టుబడి ఖాతాలను ఆదాయపు పన్ను అధికారులు యాక్సెస్ చేసుకొని చెక్ చేసే రైట్ ఉంటుంది.

Also read:
- IndVSAus: భారత క్రికెట్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది
- Damodara Rajanarasimha: గాంధీ’లో డ్యూటీకి డాక్టర్ల డుమ్మా

