జమ్ము కశ్మీర్ (Jammu & Kashmir )లో ఎన్ కౌంటర్ ఐదుగురు ఉగ్రవాదుల హతం
ఢిల్లీ: జమ్ముకశ్మీర్లో(Jammu & Kashmir )జరిగిన ఎన్కౌంటర్లో ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్లోని(Jammu & Kashmir )కుల్గామ్ జిల్లా నెహామా ప్రాంతంలోని సామ్నోలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన వారిని లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. నెహామా ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వారిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. జవాన్లు దీటుగా స్పందించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు అదనపు బలగాలను మోహరించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టారు. ఇవాళ ఉదయం కాల్పులు ప్రారంభం కాగా ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Read More:

