Jayam Ravi: విడాకుల ప్రకటన!

నటుడు (Jayam Ravi) జయం రవి తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు జయం రవి. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్‌ చేశారు. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు (Jayam Ravi) జయం రవిగా మారిపోయింది. తన విడాకుల విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్టు పెట్టాడు. ‘జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. మీలో చాలామంది నన్ను ఆదరించి నాకు మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో, మీడియాతో పారదర్శకంగా, నిజాయతీగా ఉంటాను. నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. Imageఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. మాతో పాటు మా కుటుంబసభ్యుల గోప్యతను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈవిషయంపై రూమర్స్‌, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను.’ అని పేర్కొన్నారు.

‘జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. మీలో చాలామంది నన్ను ఆదరించి నాకు మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో, మీడియాతో పారదర్శకంగా, నిజాయతీగా ఉంటాను. నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. Imageఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. మాతో పాటు మా కుటుంబసభ్యుల గోప్యతను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈవిషయంపై రూమర్స్‌, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను.’ అని పేర్కొన్నారు.

Also read: