నాలుగేండ్లకే తూములు కొట్టుకుపోతయా?
–50 ఏండ్ల కిందట మేం కట్టన వాటికి చెక్కుచెదరలేదు
–కాళేశ్వరానికి కేంద్ర జలమండలి పర్మిషన్ లేదు
–ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(minister jeevan reddy)
జగిత్యాల: -కాళేశ్వరానికి కేంద్ర జలమండలి అనుమతులు లేవని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(minister jeevan reddy) అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై జీవన్‌రెడ్డి(minister jeevan reddy) తీవ్రంగా విమర్శించారు. ‘ప్రాజెక్టు కట్టిన నాలుగేండ్లలోనే కాళేశ్వరం తూములు కొట్టుకుపోతాయా? 50 ఏండ్ల కిందట కాంగ్రెస్ కట్టిన ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్, శ్రీశైలం చెక్కు చెదరలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి పాల్పడిన వారిని శిక్షించాలి’ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
More Read:
- medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై కేసు
- dalitha bandhu:దళితబంధు రచ్చ.. సర్పంచ్ ఇంటికి తాళం
- Palla Rajeshwar Reddy: పల్లా గో బ్యాక్

