నటి (Jhanvi) జాన్వీకపూర్ ఆస్ప్రతి పాలైంది. దవాఖానలో చేరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్ వెల్లడించారు. ఆమె ఆరోగ్యంపై తండ్రే స్వయంగ అప్డేట్ ఇచ్చారు. ఫుడ్ పాయిజనింగ్ (ఆహార కల్తీ) వల్లే ఈ ఇబ్బంది తలెత్తిందని ప్రస్తుతం కోలుకుంటోందని చెప్పడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. త్వరలో ఆమె ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ మూవీ ఉల్లజ్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇలా జరగడంతో ప్రమోషన్లకు బ్రేక్ పడింది. ఇక్కడ దేవర బృందం కూడా కాస్తా కంగారు పడింది. ఆమె పాల్గొనాల్సిన కొంత టాకీ పార్ట్, పాటలు పెండింగ్ ఉన్నట్టు సమాచారం. దర్శకుడు కొరటాల శివ వాటికి సంబంధించిన షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఉంచారు.హైదరాబాద్ కు వచ్చే పరిస్థితిలో ఇప్పుడు (Jhanvi ) జాన్వీ ఉందో లేదో మరి. వాయిదాల పర్వంలో నలిగి సెప్టెంబర్ 27 ఫైనల్ డేట్ లాక్ చేసుకున్న దేవర టీమ్ ఉరుకుల పరుగుల మీద పనులు చేస్తోంది. టెన్షన్ పడేందుకు అంతగా లేకపోయినా ఫుడ్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే సెలబ్రిటీగా జాన్వీకి ఎక్కడ ఆహారం తేడా కొట్టిందో తెలియాల్సి ఉంది. ఇటీవలే అంబానీ ఇంటి పెళ్లికి, ఉల్లజ్ ఈవెంట్లకు తప్ప బయటి ఎక్కడ తినలేదట. దేవర తర్వాత రామ్ చరణ్ 16లో
ఆడిపాడనున్న శ్రీదేవి తనయ న్యాచురల్ స్టార్ నాని 33లో కూడా ఛాన్స్ కొట్టేసిందనే వార్త మీడియాలో వస్తున్న ఆ టీం ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు.నటి జాన్వీకపూర్ ఆస్ప్రతి పాలైంది. దవాఖానలో చేరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్ వెల్లడించారు. ఆమె ఆరోగ్యంపై తండ్రే స్వయంగ అప్డేట్ ఇచ్చారు. ఫుడ్ పాయిజనింగ్ (ఆహార కల్తీ) వల్లే ఈ ఇబ్బంది తలెత్తిందని ప్రస్తుతం కోలుకుంటోందని చెప్పడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. త్వరలో ఆమె ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ మూవీ ఉల్లజ్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇలా జరగడంతో ప్రమోషన్లకు బ్రేక్ పడింది. ఇక్కడ దేవర బృందం కూడా కాస్తా కంగారు పడింది. ఆమె పాల్గొనాల్సిన కొంత టాకీ పార్ట్, పాటలు పెండింగ్ ఉన్నట్టు సమాచారం. దర్శకుడు కొరటాల శివ వాటికి సంబంధించిన షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఉంచారు.హైదరాబాద్ కు వచ్చే పరిస్థితిలో ఇప్పుడు జాన్వీ ఉందో లేదో మరి. వాయిదాల పర్వంలో నలిగి సెప్టెంబర్ 27 ఫైనల్ డేట్ లాక్ చేసుకున్న దేవర టీమ్ ఉరుకుల పరుగుల మీద పనులు చేస్తోంది. టెన్షన్ పడేందుకు అంతగా లేకపోయినా ఫుడ్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే సెలబ్రిటీగా జాన్వీకి ఎక్కడ ఆహారం తేడా కొట్టిందో తెలియాల్సి ఉంది. ఇటీవలే అంబానీ ఇంటి పెళ్లికి, ఉల్లజ్ ఈవెంట్లకు తప్ప బయటి ఎక్కడ తినలేదట. దేవర తర్వాత రామ్ చరణ్ 16లో ఆడిపాడనున్న శ్రీదేవి తనయ న్యాచురల్ స్టార్ నాని 33లో కూడా ఛాన్స్ కొట్టేసిందనే వార్త మీడియాలో వస్తున్న ఆ టీం ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు.
Also Read:
Shruti Haasan: ట్రైన్ లో శృతి పాట

