మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రూ. 55 కోట్లు ఖర్చవుతాయని, ఇందులో 50% ప్రమోటర్స్ ఇస్తారని, మిగతా 50% పర్యాటక శాఖ సమకూర్చుతుందని మంత్రి (Jupally Krishna Rao) జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక శాఖ కూడా స్పాన్సర్స్ ను తీసుకొస్తుందని వివరించారు. ఈ ఈవెంట్ కు వివిధ దేశాల నుంచి మూడు వేల మంది మీడియా ప్రతినిధులు వస్తారని చెప్పారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో విజిట్ చేసేలా ఏర్పాట్లు చేశామని (Jupally Krishna Rao) వివరించారు. పర్యాటక శాఖ చెల్లించే 50%లో 5 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగతా 22 కోట్ల రూపాయలు స్పాన్సర్ షిప్ దావరా వస్తుందని తెలిపారు. స్పాన్సర్ల ద్వారా నాలుగింతల డబ్బు ప్రభుత్వానికి వస్తుందని జూపల్లి వివరించారు.
అందాల పోటీ షెడ్యూల్ ఇది
మే 6,7 తేదీల్లో హైదరాబాద్ కు కంటెస్టెంట్స్
పోటీలకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హైటెక్స్ వేదికలు
మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఓపెనింగ్ సెరిమనీ
ఓపెనింగ్ సెరిమనీలో పరేడ్ స్టైల్ థీమ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్, ట్రైబల్ డ్యాన్స్ ఫెర్మార్మెన్స్
31 న హైటెక్స్ లో ఫైనల్ పోటీలు
13 న చౌమహల్లా ప్యాలెస్ లో వెల్కం డిన్నర్.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్ వైజ్ గా స్పిరిచ్యువల్, హెరిటేజ్, మెడికల్ టూర్ లో భాగంగా తెలంగాణ లోని పర్యాటక ప్రాంతాలకు
విజిట్ లో భాగంగా చార్మినార్, లాడ్ బజార్, నాగార్జున సాగర్, వరంగల్ లోని కాళోజీ కళాక్షేత్రం, రామప్ప టెంపుల్, యాదగిరిగుట్ట, పోచంపల్లి, అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఎక్సిపీరియం ఎకో టూరిజం పార్క్ తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సెక్రటేరియట్, శిల్పారామం సందర్శిస్తారు
జూన్ 2 న తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్, సీఎం లని కలవనున్న మిస్ వరల్డ్ విన్నర్స్.
Also read:

