Durga: మహాలక్ష్మిగా కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ కనకదుర్గాదేవి(Durga) మహాలక్ష్మీ అవతారంలో దర్శనం ఇస్తున్నారు. అమ్మలగన్న అమ్మ దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకూ మహాలక్ష్మీ దేవి అవతారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. ‘త్రిశక్తి’లలో ఒకరైన శ్రీ మహాలక్ష్మీ దేవి ఐశ్వర్యానికి, ధైర్యానికి ప్రతీతి. మహిషాసుర సంహారంలో భాగమైన శ్రీ మహాలక్ష్మి.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమలం, వరదహస్తంతో భక్తులను అనుగ్రహిస్తోంది. ఇవాళ మధ్యరాత్రి నుంచి చదువుల తల్లి సరస్వతీదేవిగా అలంకారం ప్రారంభం కానుంది. శ్రీశైల మహాక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఆరో రోజు అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమిస్తోంది. నాలుగు చేతులు, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం చేతపట్టుకుని సింహవాహనంపై భక్తులను అనుగ్రహిస్తోంది భ్రమరాంబికాదేవి.

Also Read :